The Desk … Bhimavaram : దుష్టశక్తుల నివారణకు సుదర్శన హోమం

The Desk … Bhimavaram : దుష్టశక్తుల నివారణకు సుదర్శన హోమం

🔴 పగో: భీమవరం : ది డెస్క్ :

మావుళ్లమ్మ సన్నిధిలో వైభవంగా హోమ మహోత్సవం

1200 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ

భీమవరంలోని మావుళ్లమ్మవారి దేవస్థానంలో లోకక్షేమం, దుష్టశక్తుల నివారణ, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, విజయాలు, కుటుంబ సౌఖ్యం, గ్రహదోష నివారణతో పాటు వ్యాపారాభివృద్ధి కోసం బుధవారం సుదర్శన హోమ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సిద్ధాంతి, జ్యోతిష్యవేత్త ర్యాలి కృష్ణప్రసాద్ సహకారం అందించినట్లు దేవస్థానం ఈవో తెలిపారు.

హోమంలో స్థానిక ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు (సత్యవాణి దంపతులు) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వారికి శేషవస్త్రం సమర్పించి సత్కరించారు.

సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :.

సుదర్శన హోమం ఫలితంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

పట్టణ ప్రముఖులు తోట సీతామహాలక్ష్మి, కోళ్ల నాగేశ్వరరావు, చనమల చంద్రశేఖర్ తదితరులు హోమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమం మొత్తం వేదమంత్రాల నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

హోమానంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు సుమారు 1200 మందికి అన్నప్రసాద వితరణ నిర్వహించినట్లు అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు తెలిపారు.

Sudarshana Homam Conducted for the Removal of Negative Forces

Grand Homam Ceremony Held at Sri Mavullamma Temple

Annadanam Served to 1,200 Devotees

A grand Sudarshana Homam was conducted on Wednesday at the renowned Sri Mavullamma Temple in Bhimavaram for the welfare of society, removal of negative energies, good health, prosperity, peace, success, family well-being, relief from planetary afflictions, and business growth.

The sacred ritual was performed under the guidance of the temple’s chief priest, Brahmasri Maddirala Mallikarjuna Sharma, along with Vedic scholars and priests, amidst the chanting of Vedic hymns. According to the temple authorities, renowned astrologer and spiritual scholar Ryali Krishna Prasad extended his support for the event.

Local MLA and PAC Chairman Pulaparthi Ramanjaneyulu, along with his wife Satyavani, participated in the Homam and offered special prayers. On the occasion, Temple Assistant Commissioner Buddha Mahalakshmi Nagesh honored the couple by presenting them with traditional ceremonial garments.

Speaking on the occasion, the MLA said :

He prayed to the Goddess that the blessings of the Sudarshana Homam would bring happiness, good health, prosperity, and peace to all people.

Several prominent personalities from the town, including Thota Seethamahalakshmi, Kolla Nageswara Rao, and Chanamala Chandrasekhar, participated in the ritual and offered prayers to the Goddess.
The temple premises resonated with Vedic chants throughout the ceremony, creating a deeply spiritual atmosphere. Devotees participated with great devotion and reverence.

Following the Homam, prasadam was distributed to devotees, and Annadanam (free community meal) was served to approximately 1,200 devotees, according to Assistant Commissioner Buddha Mahalakshmi Nagesh, Temple Chairman Bondada Nagabhushanam, and the temple trustees.