🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :
భక్తిశ్రద్ధలతో విశ్వకర్మ జయంతి వేడుకలు
విశ్వకర్మ సన్నిధిలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు
నందిగామలో విశ్వకర్మ జయంతి వేడుకలు, అభివృద్ధి కార్యక్రమాలు గురువారం ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ భగవానుడి ఊరేగింపులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. శివాలయం నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం వరకు సాగిన ఊరేగింపులో భక్తులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ మహిళల ఆధ్వర్యంలో 108 జల బిందెలతో విశ్వకర్మ భగవానుడికి జలాభిషేకం చేశారు.
చందాపురం అంగన్వాడీ కాంపౌండ్ వాల్ :
అంగన్వాడీ కాంపౌండ్ వాల్‌కు శంకుస్థాపన
చందాపురంలో రూ.14 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం
అనంతరం నందిగామ మండలం చందాపురంలో రూ.14 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రం కాంపౌండ్ వాల్ పనులకు ఎమ్మెల్యే సౌమ్య శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.
గణనాథుని సన్నిధిలో ఎమ్మెల్యే సౌమ్య :
నందిగామలో ఘనంగా గణేష్ ఉత్సవాలు
24వ ఏట అడుగుపెట్టిన గణేష్ ఉత్సవాలు
గణనాథుని చెంత భక్తిభావంతో ఎమ్మెల్యే సౌమ్య
పాత కూరగాయల మార్కెట్ సెంటర్లో సీతారామాంజనేయ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న 24వ సంవత్సరం గణేష్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే సౌమ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. గణేష్ ఉత్సవాలు ప్రజల్లో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు.

