The Desk Special :- దేవాలయ భూముల బకాయిలపై దృష్టి సారించాలి

The Desk Special :- దేవాలయ భూముల బకాయిలపై దృష్టి సారించాలి

🔴 అమరావతి : ది డెస్క్ ప్రత్యేకం :

దేవాలయ భూములు, లైసెన్సులు, లీజులకు సంబంధించిన మొండి బకాయిలపై సర్కార్ యాక్షన్ ఇంకెప్పుడు..?

రాష్ట్రంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాలు, సత్రాలకు సంబంధించిన భూముల శిస్తు బకాయిలను తక్షణమే వసూలు చేసేందుకు చర్యలు చేపట్టాలి. చాలా దేవాదాయ సంస్థలు కేవలం ఈ భూముల నుంచి వచ్చే శిస్తులపైనే ఆధారపడి నడుస్తున్నాయని చెప్పడంలో సందేహమే లేదు.

అయితే, కొంతమంది కౌలుదారులు సకాలంలో శిస్తు చెల్లిస్తున్నప్పటికీ, మరికొందరు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏళ్లుగా బకాయిలు పెడుతున్నారని పలువురిలో ఆవేదన వ్యక్తం అవుతుంది. దీనివల్ల దేవాలయాలు, సత్రాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడి, నిత్య ధూపదీప నైవేద్యాలకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడుతోంది.

రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న కొంతమంది మొండి బకాయిదారులు, తమ పలుకుబడిని ఉపయోగించుకుని బకాయిలు చెల్లించడంలేదు. ఈ సమయాన్ని అనుకూలంగా మార్చుకుని, వారి నుండి బకాయిలన్నీ వసూలు చేసేలా దేవాలయ సిబ్బంది మరియు అధికారులు ఒకరికొకరు సహకరించుకొని, ఇకనైనా దేవాలయాల ఆర్థిక ప్రయోజనాలను కాపాడి, దేవాలయాల ఆస్తులను కూటమి సర్కార్ పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి.

సదరు విషయంపై దేవదాయ శాఖ మంత్రి , కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చొరవ తీసుకోవాలి.