కాబోయే దంపతులను ఆశీర్వదించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🟡 హైదరాబాద్ /ఏలూరు : ది డెస్క్ :

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్ లో పార్క్ హయత్ హోటల్ లో అట్టహాసంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హాజరై, కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి వారిని ఆశీర్వదించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వరుడు సూర్యతేజతో జనని వివాహం త్వరలోనే జరగనుంది. ఆదివారం జరిగిన నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కాబోవు దంపతులను నిండు మనసుతో ఆశీర్వదించి, అనంతరం బండ్ల గణేష్ తో, వేడుకకు హాజరైన ఇతర ప్రముఖులతో కాసేపు ముచ్చటించారు.

