🟡 ఎన్టీఆర్ జిల్లా | నందిగామ | ది డెస్క్
నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని తగ్గించి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సోమవారం నందిగామ రైతు బజార్లో నూతన రైస్ షాప్‌ను ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లు, రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కువకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మార్కెట్లో రూ.62 వరకు ఉన్న బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని రూ.52కు, గ్రేడ్-1 రా రైస్‌ను రూ.50కు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించే సంక్షేమ కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే సౌమ్య అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.

