The Desk … Vunguturu : నీటి నిల్వ ప్రాంతాలు, కాలువల శుభ్రత

The Desk … Vunguturu : నీటి నిల్వ ప్రాంతాలు, కాలువల శుభ్రత

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : అక్కుపల్లి గోకవరం : ది డెస్క్ :

భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం ఏ.గోకవరం గ్రామంలో గురువారం.. నీరు నిలిచిన ప్రాంతాలతో పాటు మురుగు కాలువలను శుభ్రం చేశారు.

వర్షపు నీరు నిలిచిపోవడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉండటంతో అధికారులు పారిశుద్ధ్య సిబ్బందితో ప్రత్యేకంగా శుభ్రత చర్యలు చేపట్టారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

ఇదే క్రమంలో బుధవారం గ్రామంలోని డంపింగ్‌ యార్డును శుభ్రం చేయగా, గురువారం నీటి నిల్వ ప్రాంతాలు, డ్రెయిన్లపై దృష్టి సారించారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామంలో ఎక్కడా నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.