🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :

పేదలకు అండగా ఉచిత వైద్యం
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైద్య శిబిరం
ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించి, అవసరమైన రక్త పరీక్షలు చేశారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
శిబిరం నిర్వహణను టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి పర్యవేక్షించారు. వైద్య సేవలు పొందుతున్న వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళకు కుట్టుమిషన్‌ను అందజేశారు. ఉచిత వైద్య సేవలు అందించిన ఎమ్మెల్యేకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.

