The Desk … Eluru : ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం : ఎంపీ పుట్టా మహేష్‌

The Desk … Eluru : ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం : ఎంపీ పుట్టా మహేష్‌

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

పల్లెల్లో 97 శాతం.. పట్టణాల్లో 94 శాతం కూటమి స్ట్రైక్‌రేట్‌

పల్లెల్లో కూటమిదే పైచేయి

ప్రజల రుణం తీర్చుకుంటాం

గెలుపు బాధ్యతను గుర్తించాలి

అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి

ప్రజా తీర్పు.. అభివృద్ధికి పిలుపు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని అభివృద్ధి, సంక్షేమ పాలనతో నిలబెట్టుకుంటామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో విజయం సాధించిన కూటమి అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో 94 శాతం, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో 97 శాతం స్ట్రైక్‌రేట్‌ సాధించామని పేర్కొన్నారు. ప్రజల తీర్పు బాధ్యతను మరింత పెంచిందని, విజేతలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా పనిచేయాలని ఎంపీ కోరారు.