The Desk … Nandigama : పార్టీ గీత దాటితే వేటు తప్పదు : నేతలకు తంగిరాల సౌమ్య హెచ్చరిక

The Desk … Nandigama : పార్టీ గీత దాటితే వేటు తప్పదు : నేతలకు తంగిరాల సౌమ్య హెచ్చరిక

🟡 NTR జిల్లా : నందిగామ : ది డెస్క్ న్యూస్ :

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు

పార్టీ నిర్ణయమే శిరోధార్యం

ధిక్కరిస్తే చర్యలు ఖాయం

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పరిటాల, పెద్దాపురం, తుర్లపాడు, జుజ్జూరు గ్రామాల్లో కొందరు నేతలు పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇప్పటికే పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లిందని తెలిపారు. పార్టీ నిర్ణయాలను ధిక్కరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని, భవిష్యత్తులో ఇలాంటి వైఖరిని సహించబోమని హెచ్చరించారు.