The Desk … Eluru : వెంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం

The Desk … Eluru : వెంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఆర్‌ఆర్‌పేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో 25వ వార్షిక పవిత్రోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్ పాలడుగు వెంకట రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఆయన సతీమణి మీనా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులను పట్టు వస్త్రాలతో సత్కరించగా.. ప్రధాన అర్చకులు కిలాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, వేదపారాయణం నిర్వహించారు.

వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌కు శంకుస్థాపన :

ఏలూరు నగరంలోని పత్తేబాద నర్సింగ్‌ స్కూల్‌ ప్రాంగణంలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నూతన వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరై పనులకు శంకుస్థాపన చేశారు. ఉద్యోగ, విద్య కోసం ఏలూరుకు వచ్చే మహిళలకు సురక్షిత వసతి కల్పించేందుకు ఈ హాస్టల్‌ దోహదపడుతుందని ఆయన తెలిపారు. నిర్మాణానికి రూ.50 లక్షలు విరాళంగా అందించిన కొవ్వలి గ్రామానికి చెందిన బూసి యేసేబు, ప్రభావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎంబీఎస్‌వీ ప్రసాద్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.