The Desk … Eluru : విలీన గ్రామాలకు గోదావరి జలాల దిశగా మరో ముందడుగు.. రూ.1.65 కోట్లతో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌కు శంకుస్థాపన

The Desk … Eluru : విలీన గ్రామాలకు గోదావరి జలాల దిశగా మరో ముందడుగు.. రూ.1.65 కోట్లతో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌కు శంకుస్థాపన

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు: ది డెస్క్ :

ఏలూరు నగరంలో విలీనమైన గ్రామాలకు సురక్షిత గోదావరి తాగునీరు అందించేందుకు అమృత్‌ 2.0 పథకం కింద కీలక అడుగులు పడుతున్నాయని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌, ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. సోమవారం 27వ డివిజన్‌ చొదిమెళ్లలో రూ.1.65 కోట్ల వ్యయంతో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌హెడ్‌ నీటి ట్యాంక్‌ నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు.

సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ :

అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు రహదారి, బోరు పనులకు రూ.57 లక్షల ఎంపీ నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏలూరు పార్లమెంట్‌ పరిధిలో రూ.1,300 కోట్లతో 12 రైల్వే ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం కొనసాగుతోందన్నారు.

సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ :

విలీన గ్రామాల్లో ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించేందుకు రూ.299.37 కోట్లతో అమృత్‌ 2.0 కింద తాగునీరు, డ్రైనేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటుపల్లి విక్రమ్‌కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.