The Desk … Eluru : రైతు సమస్యలపై రాజకీయం తగదు.. పొగాకు రైతులకు అండగా ప్రభుత్వం➖ఎంపీ పుట్టా మహేష్

The Desk … Eluru : రైతు సమస్యలపై రాజకీయం తగదు.. పొగాకు రైతులకు అండగా ప్రభుత్వం➖ఎంపీ పుట్టా మహేష్

🟡 ఏలూరు జిల్లా | ఏలూరు | ది డెస్క్ :

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.

ఏలూరులో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్, మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ :

బ్యారెల్‌కు రూ.50 వేల వడ్డీ లేని రుణంతో పాటు, లోగ్రేడ్ పొగాకుకు రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ.10 అదనపు మద్దతు అందించనున్నట్లు వెల్లడించారు. బ్రైట్ రకం పొగాకుకు రూ.240, మీడియం రకానికి రూ.190, లోగ్రేడ్‌కు రూ.110 కంటే తక్కువ కాకుండా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతు సమస్యలను రాజకీయాలకు వేదికగా మార్చడం సరికాదని ప్రతిపక్షాలపై విమర్శించారు.

రైతులు పొగాకు సాగును పొగాకు బోర్డు అనుమతించిన మేరకే పరిమితం చేయాలని, ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆయిల్‌పామ్‌కు ప్రస్తుతం టన్నుకు రూ.24 వేల వరకు ధర లభిస్తోందని, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరించిన ఎంపీ, లక్కవరం గ్రామానికి చెందిన ఓ బాధితుడికి రూ.8 లక్షల విలువైన ఎల్‌ఓసీ లేఖను అందజేశారు.