The Desk … Bhimavaram  : మావుళ్లమ్మకు మోటార్ సైకిల్ మెకానిక్స్ సారె.. మేళతాళాలతో ఊరేగింపు

The Desk … Bhimavaram : మావుళ్లమ్మకు మోటార్ సైకిల్ మెకానిక్స్ సారె.. మేళతాళాలతో ఊరేగింపు

🟡 పశ్చిమ గోదావరి జిల్లా | భీమవరం | ది డెస్క్

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అసోసియేషన్ సభ్యులు

ఆషాఢ మాసం సందర్భంగా.. భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సోమవారం మావుళ్లమ్మవారికి సారె సమర్పించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని యూనియన్ కార్యాలయం నుంచి స్వీట్లు, పండ్లు, సుమంగళీ ద్రవ్యాలతో మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ సారెకు సంప్రోక్షణ చేసి అమ్మవారికి సమర్పించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బందెల హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి ముమ్మన విజయ్ కుమార్, ఇతర పదాధికారులు, సభ్యులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.