The Desk … Nandigama : రైతన్న పొలాలకు జలకళ.. 1,682 ఎకరాలకు ఎత్తిపోతల పథకం ప్రారంభం

The Desk … Nandigama : రైతన్న పొలాలకు జలకళ.. 1,682 ఎకరాలకు ఎత్తిపోతల పథకం ప్రారంభం

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

పెద్దవరంలో స్విచ్ ఆన్ చేసిన ఎమ్మెల్యే సౌమ్య

నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో కేత వీరునిపాడు–గుత్తవారిపాలెం ప్రాంతాలకు చెందిన 1,682 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సోమవారం ప్రారంభించారు. నియోజకవర్గ పరిశీలకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, అధికారులు, కూటమి నాయకులతో కలిసి స్విచ్ ఆన్ చేశారు.

సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :

రైతు సంక్షేమానికి, సాగునీటి వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ పథకం ద్వారా 1,682 ఎకరాలకు సాగునీరు అందడంతో రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. నందిగామ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అవసరమైన పనులను దశలవారీగా చేపడుతున్నామని చెప్పారు. రైతుల ఆదాయం పెంచే దిశగా సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.