The Desk … Tadepalligudem : ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యం.. పీజీఆర్ఎస్‌లో ప్రజల వినతులు స్వీకరించిన కమిషనర్

The Desk … Tadepalligudem : ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యం.. పీజీఆర్ఎస్‌లో ప్రజల వినతులు స్వీకరించిన కమిషనర్

🔴 ఏలూరు జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వీధిలైట్లు, పారిశుద్ధ్యం, ఆస్తి పన్ను, పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి, కొన్ని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును సకాలంలో పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.