The Desk … Eluru : అభాగ్య గర్భిణికి ‘శక్తి’ టీమ్ అండ

The Desk … Eluru : అభాగ్య గర్భిణికి ‘శక్తి’ టీమ్ అండ

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ న్యూస్ :

కడుపులో బిడ్డ ప్రాణం.. కళ్లలో దిక్కులేని దీనత్వం

ఆపదలో “అమ్మలా ఆదుకొని” ఆశ్రయమిచ్చిన శక్తి టీమ్

జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలతో

కడుపులో ఓ బిడ్డ.. కళ్లముందు చీకటి.. ఆదరించే వారెవరో తెలియని దైన్యం.. అలాంటి అభాగ్య గర్భిణికి ఏలూరు జిల్లా పోలీసులే అండగా నిలిచారు.

కొత్త బస్టాండ్ వద్ద దయనీయ స్థితిలో ఉన్న మతిస్థిమితం సరిగా లేని నిండు గర్భిణిని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్‌ శివకిషోర్‌ ఆదేశాలతో శక్తి టీమ్ రక్షించింది. దిక్కులేని ఆమెకు భరోసా కల్పించి, పుట్టబోయే బిడ్డకు రక్షణగా మేమున్నాము తోడు అంటూ..ఏలూరు వన్‌స్టాప్‌ సెంటర్‌కు తరలించి, ప్రాథమిక వైద్య పరీక్షలు, పోషకాహార ఏర్పాట్లను పర్యవేక్షించారు.

మెరుగైన సంరక్షణ, పునరావాసం కోసం హనుమాన్‌ జంక్షన్‌లోని ప్రత్యేక స్వచ్ఛంద సంస్థ ఆశ్రయానికి తరలించే ఏర్పాట్లు చేశారు. తన వివరాలు చెప్పలేని స్థితిలో ఉన్న ఆమె వివరాలను గుర్తించేందుకు శక్తి టీమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

కన్నీటి కథకు మానవత్వమే సమాధానం అనే రీతిలో..ఆపదలో ఉన్న మహిళకు అండగా నిలిచిన ఎస్పీ మరియు శక్తి టీమ్ సేవలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి.

“ఆమెకు దిక్కెవరూ లేకపోవచ్చు.. కానీ మానవత్వం ఇంకా బతికే ఉంది. ఆ బిడ్డకు ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే శక్తి టీమ్ పోలీసుల రూపంలో ఓ భరోసా దొరికింది.