The Desk … Eluru : మోదీకి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

The Desk … Eluru : మోదీకి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :

ప్రజాసేవలో 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు

పవర్‌పేట టీడీపీ కార్యాలయంలో దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపిన చంటి

దేశ సేవలో ప్రధాని మోదీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం, ప్రజాసేవలో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఏలూరు పవర్‌పేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు దీపాలు వెలిగించి ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మోదీ ఆయురారోగ్యాలతో దేశ సేవలో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.