🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :
ఉచిత వైద్య శిబిరానికి ప్రజల క్యూ
ఏడాదిగా.. ప్రతి గురువారం వైద్య సేవలు
బడేటి క్యాంపులో వైద్య సేవలకు విశేష స్పందన
ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆదేశాల మేరకు బడేటి క్యాంపు కార్యాలయంలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. గత ఏడాది కాలంగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ శిబిరానికి ఏలూరు నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందుతున్నారు.
కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్య వరప్రసాద్ (కంప్యూటర్ ప్రసాద్), ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం పరిశీలించారు. పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

