The Desk… Amaravati : అమరావతికి రూ.3,116/- విరాళం

The Desk… Amaravati : అమరావతికి రూ.3,116/- విరాళం

🔴 అమరావతి /ఏలూరు జిల్లా : ది డెస్క్ :

JPF ఫౌండర్ దయానందంను అభినందించిన డాక్టర్ మనోజ్

అమరావతి అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అమరావతి బ్రాండ్‌ అంబాసిడర్‌, వైద్య విద్యార్థిని అంబులి వైష్ణవి, ఆమె తండ్రి డాక్టర్‌ మనోజ్‌ చేపట్టిన ‘అమరావతికి జీవం చూద్దాం.. రూ.116 సాయం చేద్దాం’ ఉద్యమానికి స్పందన లభిస్తోంది.

ఈ కార్యక్రమానికి మద్దతుగా విజయవాడ మధురానగర్‌కు చెందిన రెవ. డాక్టర్‌ బి. దయానందం, జేపీఎఫ్‌ ఫౌండర్‌, అధ్యక్షుడు, దయానంద ట్రస్ట్‌ ద్వారా రూ.3,116లను సీఆర్డీఏ ఖాతాకు విరాళంగా అందించారు. అమరావతి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమవంతు భాగస్వామ్యం కావాలనే సందేశంతో ఈ విరాళం అందించినట్లు తెలిపారు.

చిన్న మొత్తమైనా.. అమరావతి అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం అని నిర్వాహకులు పేర్కొన్నారు. రూ.116తో ప్రారంభమైన ఈ ఉద్యమానికి వివిధ ప్రాంతాల నుంచి మద్దతు లభిస్తుండటం పట్ల అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ హర్షం వ్యక్తం చేశారు.