🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తణుకు రోడ్డులో భారీ క్లీనింగ్ డ్రైవ్
స్వచ్ఛత హి సేవ–2026లో భాగంగా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం తణుకు రోడ్ కాలువ గట్టుపై భారీ శుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, ప్రత్యేక గ్రేడ్ కమిషనర్ ఎం.యేసుబాబు నేతృత్వంలో అధికారులు, సిబ్బంది శ్రమదానం చేశారు.

ఎమ్మెల్యే, కమిషనర్ స్వయంగా చీపుర్లు, పారలతో చెత్తను తొలగించారు. జేసీబీ, ట్రాక్టర్లతో కాలువ గట్టుపై పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్త, గుర్రపుడెక్కను తొలగించారు. కాలువల్లో మురుగు, చెత్త, ప్లాస్టిక్ వేయకుండా ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. కాలువ గట్టులపై చెత్త వేస్తే జరిమానాలు విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు.
కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

