🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

స్వచ్ఛత హి సేవ–2026లో భాగంగా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు 4 బిన్స్ విధానంపై అవగాహన కల్పించారు. స్పెషల్ గ్రేడ్ కమిషనర్ ఎం. యేసుబాబు తడి, పొడి, ప్రమాదకర, శానిటరీ వ్యర్థాలను వేర్వేరుగా బిన్లలో వేయాలని సూచించారు.

అనంతరం విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ వై. వెంకటరమణ, ఏసీపీ జి. సీతారాం, మున్సిపల్ మేనేజర్ పి. ప్రసాదరావు, ఇతర అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

