🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం : ది డెస్క్ :

సూపర్ సిక్స్ అమలుకు ప్రాధాన్యం
➖ఎమ్మెల్యే చంటి
సూపర్ సిక్స్ పథకాల అమలుతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి తెలిపారు. బుధవారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయన వివిధ సమస్యలపై వచ్చిన వినతులను స్వీకరించారు. ప్రజలను ఆత్మీయంగా పలకరించి, సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.
అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

