🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
51 కేజీల లడ్డూ వితరణ
పట్టణంలోని మావుళ్లమ్మవారి ఉపాలయమైన శ్రీ అశ్వద్ధ గణపతి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.
తాపేశ్వరానికి చెందిన సురుచి స్వీట్స్ వారు స్వామివారికి సమర్పించిన 51 కేజీల లడ్డూను ఎమ్మెల్యే భక్తులకు వితరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.

