🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
HAMతో రహదారులు, డివైడర్లు, లైట్లు, పార్కుల ఆధునీకరణ
ఫుడ్‌కోర్టులో స్వచ్ఛతకు పెద్దపీట
చీపురు పట్టిన కమిషనర్
పరిశుభ్రతే ప్రజారోగ్యానికి రక్ష
పట్టణ సౌకర్యాల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (HAM) పథకం కింద రూ.33 కోట్లతో రహదారులు, సెంట్రల్ డివైడర్లు, వీధి దీపాలు, మున్సిపల్ పార్కుల ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. బలుసులమ్మ కల్యాణ మండపంలో నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొనగా, కమిషనర్ ఎం. యేసుబాబు అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వచ్ఛత హి సేవలో భాగంగా కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో శుభ్రత :
స్వచ్ఛత హి సేవ–2026లో భాగంగా ఎస్వీఆర్ విగ్రహం వద్ద మున్సిపల్ ఫుడ్‌కోర్టులో ప్రత్యేక శుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ ఎం. యేసుబాబు స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ఫుడ్ స్టాల్స్ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఆహార విక్రయ ప్రదేశాలను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచాలని వ్యాపారులకు సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్, సచివాలయ, పారిశుద్ధ్య సిబ్బంది, ఫుడ్‌కోర్టు నిర్వాహకులు పాల్గొన్నారు.

