The Desk … Dwarakathirumala : రితిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ప్రముఖ జర్నలిస్టు దర్శి సత్యనారాయణకు నంది అవార్డు

The Desk … Dwarakathirumala : రితిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ప్రముఖ జర్నలిస్టు దర్శి సత్యనారాయణకు నంది అవార్డు

🔴 ఏలూరు జిల్లా : ద్వారకాతిరుమల : ది డెస్క్ :

రితిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ జర్నలిస్టు దర్శి సత్యనారాయణకు నంది అవార్డు ప్రధానం చేశారు.
ద్వారకాతిరుమలలోని షణ్ముఖ ఫంక్షన్ హాల్ నందు రితిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్ కేటగిరీలో ఏలూరు నగరానికి చెందిన దర్శి సత్యనారాయణ నంది అవార్డును కైవసం చేసుకున్నారు.

సందర్భంగా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంట మురళి మాట్లాడుతూ :

జర్నలిస్ట్ గా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ నీతి నిజాయితీలతో ప్రజల యొక్క హృదయాలను గెలుచుకున్న జర్నలిస్టు దర్శి సత్యనారాయణకు అవార్డును ప్రధానం చేయటం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ సర్వీస్ కేటగిరీలో ముదినేపల్లికి చెందిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, డాక్టర్ మనోజ్ లకు నంది అవార్డులను ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా అవార్డు పొందిన దర్శి సత్యనారాయణకు ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ జర్నలిస్టులు అభినందనలు తెలిపారు.