🔴 కాకినాడ జిల్లా : కాకినాడ/సర్పవరం : ది డెస్క్ :
ఫిషింగ్ హార్బర్‌లో రాళ్ల మధ్య ఇరుక్కున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని సోమవారం గుర్తించినట్లు సర్పవరం పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
మృతదేహం కొంతకాలంగా నీటిలో ఉండటంతో ముఖాకృతి మారిపోయినట్లు కనిపిస్తోంది. మృతుడి ఆచూకీ లేదా కుటుంబ సభ్యుల వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని వివరాల సేకరణకు చర్యలు చేపట్టారు.
మృతుడి గురించి లేదా అతని కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిసిన వారు వెంటనే సర్పవరం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

