The Desk … Tadepalligudem : ప్రజా ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం

The Desk … Tadepalligudem : ప్రజా ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

PGRSలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కమిషనర్ యేసుబాబు

తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం (PGRS)లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఎం.యేసుబాబు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు.

తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, ఆస్తిపన్ను, పెన్షన్లు, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. పలు ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.

ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించి, అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.