The Desk … Ravulapalem : ▪️స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర▪️గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ముక్తేశ్వరరావు అధ్యక్షతన..

The Desk … Ravulapalem : ▪️స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర▪️గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ముక్తేశ్వరరావు అధ్యక్షతన..

🔴 కోనసీమ జిల్లా : రావులపాలెం : ది డెస్క్ :

రావులపాలెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మూడవ శనివారం సందర్భంగా… ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా.. ప్రత్యేక అధికారి బి ఎం ముక్తేశ్వరరావు అధ్యక్షతన ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా… “ప్లాస్టిక్ రహిత సమాజం మరియు ఆపరేషన్ క్లీన్ స్వీప్” అనే థీమ్ తో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది అధికారులుతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల సాధనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిర్మూలనలో, వాడకం తగ్గించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు అమలాపురం పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి వెంకట సత్యనారాయణ రాజు, రావులపాలెం నీటి సంఘం అధ్యక్షులు కొవ్వూరి వెంకట సత్యనారాయణ రెడ్డి, రావులపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొవ్వూరు అచ్చిరెడ్డి, రావులపాలెం సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తుల పట్టాభి రామారావు, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కోట సోమేశ్వరరావు, రావులపాలెం జనసేన పార్టీ అధ్యక్షులు అంబటి కిషోర్, జోగి శ్రీనివాసరావు, జక్కంపూడి లక్ష్మీనారాయణ, మేడపాటి కాసు రెడ్డి, గ్రామ పెద్దలు, ప్రజలు, గ్రామపంచాయతీ మరియు సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.