🔴 తూగో జిల్లా : ఉండ్రాజవరం మండలం : కాల్దరి: ది డెస్క్ :
కాల్దరి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మూడవ శనివారం సందర్భంగా… ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా.. ప్రత్యేక అధికారి అధ్యక్షతన ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా… “ప్లాస్టిక్ రహిత సమాజం మరియు ఆపరేషన్ క్లీన్ స్వీప్” అనే థీమ్ తో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది అధికారులుతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల సాధనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిర్మూలనలో, వాడకం తగ్గించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు, పంచాయితీ సిబ్బంది, స్వర్ణ గ్రామ సిబ్బంది, హెల్త్ మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

