The Desk… Bhimavaram : నిత్యాన్నదానానికి రూ.1,00,116/- విరాళం

The Desk… Bhimavaram : నిత్యాన్నదానానికి రూ.1,00,116/- విరాళం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

వీరారెడ్డి–పెద్ద వీరమ్మ జ్ఞాపకార్థం

దాతల పేరున ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు

మావుళ్లమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన వితరణకు నంద్యాలకు చెందిన యాసం వెంకటేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు రూ.1,00,116/- విరాళంగా అందజేశారు. కీర్తిశేషులు యాసం వీరారెడ్డి, పెద్ద వీరమ్మ పేరుతో ఈ విరాళాన్ని ఆలయానికి సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు దాతలకు శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు.