🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ మండలం : ది డెస్క్ :
అడవిరావులపాడులో ఎమ్మెల్యే సౌమ్య విస్తృత ప్రచారం
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అడవిరావులపాడులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులతో కూడిన కరపత్రాలను పంపిణీ చేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
గ్రామంలో అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై స్థానికులతో చర్చించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ నందిగామ నియోజకవర్గాన్ని మరింత ప్రగతి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Development at doorstep, welfare within reach: MLA Soumya
Government Whip and Nandigama MLA Tangirala Soumya conducted a door-to-door outreach programme in Adaviraulapadu village on Friday, highlighting the development initiatives and welfare measures implemented by the coalition government during its two years in office.
Accompanied by coalition leaders, party workers and local representatives, Ms. Soumya visited households across the village and distributed pamphlets detailing various welfare schemes and development works taken up in the Nandigama constituency. She also interacted with residents and enquired about their civic and other local issues.
Speaking on the occasion, Ms. Soumya said the government was committed to ensuring that development and welfare reached every section of society. She said priority would be given to improving basic infrastructure and taking up development works based on the needs and requirements of local communities.
The MLA said the coalition government was working towards striking a balance between development and welfare and expressed confidence that sustained efforts would help take Nandigama constituency further along the path of progress.
Coalition leaders, party workers and local public representatives participated in the programme.

