ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : గుండుగొలను : ది డెస్క్ :
గుండుగొలను జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2004-2005 టెన్త్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ :
సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి ఎంతో విలువైందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, విజ్ఞానాన్ని పెంపొందించడంలో టీచర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. తొలుత పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సమ్మేతంగా పాఠశాల వద్దకు వచ్చి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతం సందడి వాతావరణం నెలకొంది. ఎండను సైతం లెక్క చేయకుండా వారు తమ తోటి స్నేహితులతో రోజంతా ఉత్సాహంగా గడిపారు. విద్యా రంగానికి విశిష్ట సేవలందించిన గురువులకు శాలువాలు కప్పి జ్ఞాపికలను అందించారు. పూర్వ విద్యార్థుల బృందం వేర్వేరుగా తమ గురువులతో ఫొటోలు దిగారు.
Heartwarming Reunion of Former Student
A cordial reunion of the 2004–2005 SSC (10th Class) alumni of ZP High School, Gundugolanu, was held on Sunday. On the occasion, the former students honored the teachers who had guided and educated them during their school days.
Speaking on the Occasion :
Several speakers highlighted the invaluable contribution of teachers to the development of society. They noted that teachers play a crucial role in instilling moral values, discipline, and knowledge among students.
Earlier, the alumni arrived at the school along with their family members and fondly reminisced about their cherished school-day memories. The event created a festive and vibrant atmosphere in the area. Undeterred by the summer heat, the former students spent the entire day enthusiastically interacting with their classmates and friends.
As a mark of gratitude, the alumni felicitated their teachers for their distinguished services to the field of education by presenting them with ceremonial shawls and mementos. The gathering concluded with alumni groups posing for photographs with their beloved teachers, capturing memories to be treasured for years to come.

