The Desk … Eluru : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

The Desk … Eluru : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి

సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు

ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ప్రజాప్రతినిధుల బాధ్యతని పేర్కొన్నారు.

శనివారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తమ వ్యక్తిగత, సామాజిక, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రతి వినతిని సావధానంగా పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి, సమస్యల పూర్తి వివరాలు తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ :

ప్రజలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా నిర్భయంగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు.

Public Grievance Redressal is the Government’s Primary Objective

MLA Badeti Chanti Receives Public Petitions

Officials Directed to Resolve Public Issues

District Telugu Desam Party President and Eluru MLA Badeti Chanti stated that the coalition government is giving the highest priority to resolving public grievances. He emphasized that it is the responsibility of public representatives to remain accessible to the people, understand their concerns, and take necessary steps to address them.

A public grievance redressal program was held on Saturday at the MLA Camp Office in Eluru, where a large number of people from various parts of the district participated. Citizens submitted petitions highlighting their personal, social, and infrastructure-related issues for the MLA’s attention.

On this occasion, MLA Badeti Chanti carefully examined each petition, gathered complete details of the issues, and spoke with officials from the concerned departments. He instructed them to take immediate and appropriate measures to resolve the problems.

Speaking on the occasion, he said :

People should feel free to bring any issue affecting them to his notice without hesitation. He reiterated that public welfare is the government’s foremost priority and that various welfare and development programs are being implemented for the upliftment of all sections of society.

He further stated that the government remains committed to addressing the needs of the people and will continue introducing more welfare initiatives in the future to enhance their well-being and improve their quality of life.