The Desk …Prakasam : విగ్రహాల వితరణలో మరో మైలురాయి.. 161, 162వ విగ్రహాలు అందించనున్న బుజ్జి

The Desk …Prakasam : విగ్రహాల వితరణలో మరో మైలురాయి.. 161, 162వ విగ్రహాలు అందించనున్న బుజ్జి

డా.బి.ఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్‌రామ్ విగ్రహాల అందజేతకు కాళ్లపాలెం బుజ్జి హామీ

ప్రకాశం జిల్లా : కొండేపి : ది డెస్క్ :

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం జీడుమల్లి మండలం కామపల్లి గ్రామానికి చెందిన అంబేద్కర్ యువత, ఎంఆర్‌పీఎస్ నాయకులు శనివారం ఆంధ్ర–తెలంగాణ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పన్నాస పూర్ణచంద్రరావు (కాళ్లపాలెం బుజ్జి)ని కలిసి గ్రామంలో ప్రతిష్ఠించనున్న భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగజీవన్‌రామ్ విగ్రహాలను విరాళంగా అందించాలని కోరారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రతినిధులు బుదామగుంట్ల ఎరమ్మీయ, బి. ఆదం, చంద్రశేఖర్, సునీల్, పుల్లయ్య, ప్రేమ్‌కుమార్ వినతిని స్వీకరించిన కాళ్లపాలెం బుజ్జి రెండు విగ్రహాలను అందజేస్తానని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో విగ్రహాలను కమిటీ సభ్యులకు అందజేయనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు.

ఈ నెల 28వ తేదీన విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. కార్యక్రమానికి ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. మందకృష్ణ మాదిగ హాజరు కావడం ఆనందదాయకమని రాధా రంగా మిత్రమండలి సభ్యులు కాళ్ల పాలెం బుజ్జి పేర్కొన్నారు.

కొండేపి నియోజకవర్గం నుంచి సేవ చేసే అవకాశం కల్పించిన అంబేద్కర్ యువతకు కృతజ్ఞతలు తెలియజేసిన కాళ్లపాలెం బుజ్జి, ఇప్పటివరకు 161, 162వ విగ్రహాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.