The Desk …Eluru/VJA : ఏలూరులో “సీ.బీ.సీ” ఆధ్వర్యంలో అమ్మ పేరిట మొక్క కార్యక్రమం

The Desk …Eluru/VJA : ఏలూరులో “సీ.బీ.సీ” ఆధ్వర్యంలో అమ్మ పేరిట మొక్క కార్యక్రమం

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం వట్లూరు గ్రామ పరిధిలో “ఏక్ పేడ్ మా కే నామ్” (అమ్మ పేరిట మొక్క) కార్యక్రమం జరిగింది.

వట్లూరు సంకల్పం పార్కులో జరిగిన కార్యక్రమంలో సీబీసీ అసిస్టెంట్ డైరెక్టర్ రావులపల్లి రమేష్ చంద్ర మాట్లాడుతూ.. వాతావరణ మార్పులపై భారత ప్రభుత్వం ప్రతిపాదించిన మిషన్ లైఫ్ ఉద్యమంలో భాగంగా సుస్థిరమైన, పర్యావరణ అనుకూల దైనందిన జీవన శైలి అవసరాన్ని తెలిపారు.

జపాన్ కు చెందిన మియావాకి పద్దతిలో స్థానిక ప్రజాతులతో కూడిన, పట్టణ అటవీకరణ కోసం వివిధ అవసరాలకు ఉపయోగపడే మొక్కలను పార్కులో నాటారు.

అమ్మ పేరిట మొక్క నాటే కార్యక్రమంలో ఏలూరు జీఎస్టీ సూపరింటెండెంట్ గుత్తా తులసి, రైతు సాధికార సంస్థ సలహాదారు ఆర్ అరుణ, మహిళా శిశు సంక్షేమ శాఖ సలహాదారు గారపాటి రోజా, ప్రముఖ హై కోర్ట్ న్యాయవాది జవ్వాజి శరత్ చంద్రలతో పాటు మహిళలు, పిల్లలు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.