The Desk … Eluru : ప్రజల కళ్లల్లో వెలుగులే కూటమి ప్రభుత్వ లక్ష్యం

The Desk … Eluru : ప్రజల కళ్లల్లో వెలుగులే కూటమి ప్రభుత్వ లక్ష్యం

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

మూడు ప్రాంతాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు శిలాఫలకాల ఆవిష్కరణ

మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వెల్లడి

ప్రజల కళ్లల్లో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి అన్నారు. శనివారం మేయర్ షేక్ నూర్జహాన్‌తో కలిసి సత్రంపాడు, కొత్త ఎన్టీఆర్ కాలనీ, మాదేపల్లి ప్రాంతాల్లో సుమారు ₹3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల శిలాఫలకాలను ఆవిష్కరించారు.

సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సీఎంఆర్ఎఫ్, ఎన్టీఆర్ వైద్య సేవలతో పాటు ఆరోగ్య మందిరాల నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, ప్రజలు అలాంటి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.

మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ :

మూడు ఆరోగ్య మందిరాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. నగరంలో రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం ఉన్న తాగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరించి రెండు పూటలా నీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.