The Desk …Desk : మెగా డీఎస్సీపై దుష్ప్రచారం తగదు : ➖తంగిరాల సౌమ్య

The Desk …Desk : మెగా డీఎస్సీపై దుష్ప్రచారం తగదు : ➖తంగిరాల సౌమ్య

🟡 అమరావతి : మంగళగిరి : ది డెస్క్ :

148 రోజుల్లో 16,347 కొలువులు

మెరిట్‌కే ప్రాధాన్యం

నిరుద్యోగుల ఆశలకు రెక్కలు

డీఎస్సీపై రాజకీయ రగడ ఎందుకు..❓

పారదర్శక నియామకాలు -వైసీపీకి కంటగింపు!

మెరిట్‌ జాబితా నుంచి ఎంపిక వరకు.. అంతా బహిరంగమే..!!

నిరుద్యోగుల భవితతో రాజకీయం వద్దు

➖తంగిరాల సౌమ్య

మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిరుద్యోగుల శ్రమను అవమానించేలా ఉన్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకంతో మెగా డీఎస్సీకి శ్రీకారం చుట్టారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో కేవలం 148 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. నోటిఫికేషన్‌ నుంచి మెరిట్‌ జాబితాలు, ఆన్సర్‌ కీలు, గ్రీవెన్స్‌ పరిష్కారం వరకు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు.

డీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ 335 పిటిషన్లు దాఖలు చేయించిందని సౌమ్య ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని విమర్శిస్తూ, కూటమి ప్రభుత్వం మెరిట్‌, పారదర్శకతకు పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు.