The Desk … Nandigama : నందిగామలో బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభం

The Desk … Nandigama : నందిగామలో బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభం

🔴 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

➖సుజనా చౌదరి

ప్రజా సమస్యల పరిష్కారానికి నందిగామ బీజేపీ కార్యాలయం వేదికగా నిలవాలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు. నందిగామ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ :

కుల, మతాలకు అతీతంగా ప్రజలకు సేవలందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలన్నారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాలతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం నేడు దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదగడం అసాధారణ విజయమన్నారు. ప్రతి కార్యకర్త సేవాభావంతో పనిచేసి అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు.

నందిగామ బీజేపీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్య, వైద్య రంగాల్లో సుజనా ఫౌండేషన్‌ ద్వారా అవసరమైన వారికి సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ :

దేశంలో బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, ప్రతి గ్రామం, వార్డు స్థాయికి పార్టీని విస్తరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నం గిరిధర్, పోరుగంటి నరసింహారావు, కొల్లు నాగేశ్వరరావు, బర్రె శివకృష్ణారెడ్డి, సీతారామయ్య, రావూరి రమేష్, బండారు వెంకట నాగ కేదారేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.