The Desk…విజయవాడ పశ్చిమంలో టీడీపీ కార్యాలయం ప్రారంభం

The Desk…విజయవాడ పశ్చిమంలో టీడీపీ కార్యాలయం ప్రారంభం

🟡 విజయవాడ : ది డెస్క్ :

పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలి

➖తంగిరాల సౌమ్య

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ చిన్ని, ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు, ప్రజలు–కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా నూతన కార్యాలయం వేదికగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.