🔴 కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు : ది డెస్క్ :
ఊదు… ఊదు…..
ఊదామన్నానా..అంటూ…
ఉక్కుపాదం మోపిన ప్రతిపాడు పోలీసులు
డ్రంక్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్
15 కేసుల్లో రూ.లక్ష జరిమానా
5 గురికి జైలుశిక్ష
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారికి కోర్టు శిక్షలు విధించింది. ప్రత్తిపాడు జేఎఫ్‌సీఎం కోర్టులో మంగళవారం కేసుల విచారణ జరగ్గా…మొత్తం 15 కేసుల్లో రూ.లక్ష జరిమానా, ఆరుగురికి జైలు శిక్ష విధించారు.
ప్రత్తిపాడు పీఎస్ పరిధిలో మూడు కేసుల్లో ఇద్దరికి రూ.10 వేల చొప్పున జరిమానా, ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు. ఏలేశ్వరం పీఎస్ పరిధిలో నాలుగు కేసుల్లో ఇద్దరికి రూ.10 వేల చొప్పున జరిమానా, మరో ఇద్దరికి రెండేసి రోజుల జైలు శిక్ష పడింది. అన్నవరం పీఎస్ పరిధిలో ఎనిమిది కేసుల్లో ఆరుగురికి రూ.10 వేల చొప్పున జరిమానా, ఇద్దరికి రెండు, మూడు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా కఠిన చర్యలు తప్పవని ప్రత్తిపాడు సర్కిల్ పోలీసులు హెచ్చరించారు

