The Desk … Tadepalligudem : ఎన్‌టీఆర్‌ భరోసా దరఖాస్తులపై కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ

The Desk … Tadepalligudem : ఎన్‌టీఆర్‌ భరోసా దరఖాస్తులపై కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

పెన్షన్‌ దరఖాస్తులకు 16 వరకు గడువు

అర్హులైన వారంతా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోండి

సచివాలయాల్లో పెన్షన్‌ దరఖాస్తుల సందడి

కొత్త ఎన్‌టీఆర్‌ భరోసా పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను తాడేపల్లిగూడెం పురపాలక సంఘ స్పెషల్‌ గ్రేడ్‌ కమిషనర్‌ ఎం. యేసుబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని 5, 6, 7, 9వ సచివాలయాలను సందర్శించి దరఖాస్తుల స్వీకరణ తీరును పరిశీలించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త పెన్షన్ల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. అర్హులు తమ పరిధిలోని స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు కార్యాలయంలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్‌, రైస్‌కార్డు/ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పాటు సంబంధిత కేటగిరీకి అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్‌ సూచించారు.