The Desk … Nandigama : రిటైర్డ్‌ ఎంఈఓను సన్మానించిన సబ్‌ రిజిస్ట్రార్‌

The Desk … Nandigama : రిటైర్డ్‌ ఎంఈఓను సన్మానించిన సబ్‌ రిజిస్ట్రార్‌

🔴 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

విధి నిర్వహణలో నిబంధనలు, ప్రమాణాలు పాటిస్తూ, రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే వారికి సౌకర్యాలు కల్పిస్తూ గౌరవంగా సేవలందిస్తున్న నందిగామ సబ్‌ రిజిస్ట్రార్‌ దగాని శ్రీనివాసరావు అభినందనీయులని రిటైర్డ్‌ ఎంఈఓ కొప్పు రాధాకృష్ణమూర్తి అన్నారు.

తన స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ నిమిత్తం మంగళవారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చిన రాధాకృష్ణమూర్తిని శ్రీనివాసరావు శాలువాతో సత్కరించారు. అనంతరం రాధాకృష్ణమూర్తి కూడా సబ్‌ రిజిస్ట్రార్‌ను శాలువాతో సన్మానించారు.