🔴 పశ్చిమగోదావరి జిల్లా : భీమవరం : ది డెస్క్ :
హుండీ లెక్కింపులో రూ.3.02 లక్షల నగదు – 16.7 గ్రాముల బంగారం
భీమవరం పట్టణంలోని ప్రముఖ ఆరాధ్యదైవం మావుళ్లమ్మవారి దేవస్థానంలో సంపూర్ణ స్వర్ణమయం ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హుండీని బుధవారం లెక్కించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, భీమవరం దేవదాయశాఖ తనిఖీదారు పి.ఎస్. సాయికుమారి పర్యవేక్షణలో హుండీని తెరిచి లెక్కింపు చేపట్టారు.
ఈ సందర్భంగా హుండీలో రూ.3,02,696 నగదు, 16 గ్రాముల 700 మిల్లీగ్రాముల బంగారం భక్తులు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. అమ్మవారి ఆలయాన్ని సంపూర్ణ స్వర్ణమయంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, పాపోలు ఏడుకొండలు, స్వర్ణమయ ప్రాజెక్టు సభ్యులు గోంట్ల వెంకటనారాయణ, కాగిత వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

