🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
2 ఇళ్ల దొంగతనాలు ఛేదింపు
25 లక్షలు విలువ చేసే చోరీ సొత్తు రికవరీ
151.207 గ్రాముల బంగారం, 967 గ్రాముల వెండి స్వాధీనం
తాళం కనిపిస్తే చాలు.. ఇల్లు ఖాళీ
జల్సాలు.. ఆన్లైన్ పేకాట.. దొంగతనాలే దారి!
40 కేసుల నిందితుడు.. మళ్లీ పోలీసుల చేతికి!
జైల నుంచి బయటకొచ్చి – again & again..
తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నరసాపురానికి చెందిన కొత్తపల్లి నరేష్ 40కి పైగా దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు.
ఈ నెల 6, 27 తేదీల్లో తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీ, రేలంగి సెంటర్లో జరిగిన రెండు ఇంటి దొంగతనాలను పోలీసులు ఛేదించారు. జల్సాలు, ఆన్లైన్ పేకాట కోసం తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో నరేష్ వెల్లడించినట్లు డీఎస్పీ తెలిపారు. జైలు నుంచి విడుదలైన కొద్ది రోజులకే మళ్లీ దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

దొంగిలించిన వస్తువులను శేషమహాల్ సెంటర్లోని ఓ దుకాణంలో విక్రయిస్తుండగా సీఐ బి. ఆదిప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 151.207 గ్రాముల బంగారం, 967 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు.

