🔴 పగో : భీమవరం : ది డెస్క్ :

తొలి ఏకాదశి సందర్భంగా భీమవరంలోని మావుళ్లమ్మ దేవస్థానం ఆలయ ప్రాంగణంలో శనివారం 800 మంది మహిళలతో లలితా సహస్రనామ, విష్ణు సహస్రనామ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ధర్మకర్తల మండలి చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేశారు.
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ పారాయణ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషమని అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

