The Desk … Vunguturu : పలు గ్రామాల్లో పర్యటించిన స్వచ్ఛ రథం..ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి విశేష స్పందన

The Desk … Vunguturu : పలు గ్రామాల్లో పర్యటించిన స్వచ్ఛ రథం..ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి విశేష స్పందన

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు నియోజకవర్గం : ది డెస్క్ :

ఇటీవల స్వచ్ఛరథం మరమ్మతులు కారణంగా విస్తృత స్థాయిలో కొన్ని గ్రామాల్లో పర్యటించలేదు.. కావున స్వచ్ఛరథంకు పంచాయతీ అధికారులు మరమ్మతులు చేయించి తిరిగి గ్రామాలకు పంపించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నారాయణపురం, గోపీనాథ్ పట్నం, చేబ్రోలు, నల్లమాడు గొల్లగూడెం, గోపాలపురం తదితర గ్రామాల్లో స్వచ్ఛరధం పర్యటించడం జరిగింది.

ఈ స్వచ్ఛరధం రాకతో గ్రామంలోని మహిళలు వారి వద్ద నిరుపయోగంగా మిగిలి ఉన్న వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులను, అట్టలను, పేపర్లను, ఇతర ఇనుప వస్తువులను ఈ స్వచ్ఛరధoనకు ఇచ్చి రథం నుంచి వారికి అవసరమైన నిత్యవసర వస్తువుల్ని తీసుకోవడం జరిగింది.

సందర్భంగా ఉంగుటూరు ఎంపీడీవో జి ఆర్ మనోజ్ మాట్లాడుతూ :

స్వచ్ఛరధం నిర్వహణలో ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగిందని కనుక గ్రామస్తులు స్వచ్చరధం సేవలను వినియోగించుకోవాలని, గ్రామంలో పొడిచెత్తను బయట డ్రైనేజీల పాడవేయ కుండా పోగుచేసి స్వచ్ఛ రథం వచ్చిన వెంటనే ఇచ్చి తిరిగి వాటికి సమానమైన ధరకు నిత్యవసర వస్తువుల్ని తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. స్వచ్ఛరధం పర్యటించు తేదీలను ఇప్పటికే ఆయా పంచాయతీ కార్యదర్శులకు తెలియజేయడం జరిగిందని కాబట్టి పంచాయతీ కార్యదర్శులు స్వచ్ఛ రథం రాకను ముందుగానే గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయవలసిందిగా టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీ కార్యదర్శులకు తెలిపారు.

Swachh Rath Draws Enthusiastic Response from Unguturu Women

The Swachh Rath initiative received overwhelming support, especially from women, during its visits to several villages in Unguturu Mandal on Tuesday. Previously halted due to repairs, the vehicle was swiftly fixed by panchayat officials and resumed operations.

From morning to evening, the Rath covered Narayanapuram, Gopinath Patnam, Chebrolu, Nallamadu Gollagudem, Gopalapuram, and nearby villages. Villagers, particularly women, handed over unused plastics, bottles, papers, and scrap iron, receiving essential daily items in exchange at fair value.

Unguturu MPDO G. R. Manoj urged residents to utilize the service fully. “Issues with the Rath’s operations have been resolved. Avoid dumping waste in drainage channels—store dry waste and exchange it promptly for goods,” he advised via teleconference. He instructed panchayat secretaries to widely publicize upcoming visit dates, already shared with them.