32 వ వార్డులో ఎమ్మెల్యే బొలిశెట్టి చేతుల మీదుగా..!!
తాడేపల్లిగూడెం పురపాలకసంఘo అభివృద్ధి పనులలో భాగముగా…
పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

ద్వారకానగర్ 32వ వార్డులో శాసన సభ్యుల సహకారముతో CSR నిధుల నుండి “స్విమ్మింగ్ పూల్” నిర్మించడం జరిగినది. ఈ “స్విమ్మింగ్ పూల్” ను ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసన సభ్యులు “బొలిశెట్టి శ్రీనివాస్” చే రేపు అనగా 03.05.2026 ఆదివారము నాడు ఉదయం 09.00 గంటకు ప్రారంభించుట జరుగును.
ఈ కార్యక్రమమునకు పలువురు శాసన సభ్యులు మరియు జిల్లా కలెక్టర్, పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు, అధికారులు ముఖ్య అతిధులుగా విచ్చేస్తున్నారని పట్టణ పురపాలక సంఘం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు.
A new swimming pool constructed under CSR funds in Dwarakanagar’s 32nd ward will be inaugurated on Sunday (May 3, 2026) at 9:00 AM.
Government Whip and local MLA Bolisetti Srinivas will formally open the facility as part of municipal development initiatives. Several MLAs, the District Collector, and other officials are expected to attend as chief guests, according to a statement issued by the Tadepalligudem Municipal Office.

