The Desk … Bhimavaram : జిల్లాలోని అన్న క్యాంటీన్ అడ్వైజర్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం➖ వంసిధర్ (అన్న క్యాంటీన్ సీఈఓ)

The Desk … Bhimavaram : జిల్లాలోని అన్న క్యాంటీన్ అడ్వైజర్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం➖ వంసిధర్ (అన్న క్యాంటీన్ సీఈఓ)

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం పురపాలక సంఘం కార్యాలయంలో అన్న క్యాంటీన్ సీఈఓ వంసిధర్ పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్న క్యాంటీన్ అడ్వైజర్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్న క్యాంటీన్‌ల నిర్వహణ, సేవల నాణ్యత, మరియు ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలపై సమగ్రంగా చర్చించారు.

అన్న క్యాంటీన్‌లలో ఆహార పంపిణీ సమయానికి కచ్చితంగా జరిగేలా పర్యవేక్షణ బలోపేతం చేయాలని, అందిస్తున్న ఆహారం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సీఈఓ సూచించారు. క్యాంటీన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, క్యాంటీన్‌ల వద్ద గ్రీన్ షేడ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు చల్లని వాతావరణం కల్పించాలని, త్రాగునీటి సదుపాయాలను సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే, క్యాంటీన్‌లలో క్యూలైన్ వ్యవస్థను మెరుగుపరచి, లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా చూడాలని తెలిపారు.

ఇంకా, క్యాంటీన్‌ల వద్ద సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ పాటించాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, సేవలలో పారదర్శకతను కొనసాగించాలని సూచించారు. ప్రతి రోజు నిర్వహణపై రికార్డులు సక్రమంగా నిర్వహించి, ఉన్నతాధికారులకు నివేదికలు అందజేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ కమీషనర్ A.రాంబాబు , పశ్చిమ గోదావరి జిల్లా అన్న క్యాంటీన్ అడ్వైజర్ కమిటీ సభ్యులు మరియు సంబందిత సిబ్బంది పాల్గొన్నారు.