The Desk … Amaravati : తుఫాను ముప్పు.. రైతులు అప్రమత్తం

The Desk … Amaravati : తుఫాను ముప్పు.. రైతులు అప్రమత్తం

🟡 అమరావతి : ది డెస్క్ న్యూస్ :

పంటల రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి

రైతులకు అండగా క్షేత్రస్థాయిలో అధికారులు ఉండాలి

➖మంత్రి అచ్చెన్నాయుడు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. నవంబర్ 2, 3 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు పంటల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

వరి, పత్తి, మిర్చి, ఉద్యాన పంటల పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా కాలువలను సిద్ధం చేసుకోవాలని, కోతలు పూర్తయిన ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వాతావరణం అనుకూలించే వరకు పంట కోతలు, పురుగుమందుల పిచికారీ వాయిదా వేయాలని తెలిపారు.

వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు గ్రామస్థాయిలో అందుబాటులో ఉండి రైతులకు సూచనలు అందించాలని ఆదేశించారు. రైతులు అధైర్యపడవద్దని, పంటల పరిరక్షణకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.