🔴 ఎన్టీఆర్ జిల్లా : కంచికచర్ల : ది డెస్క్ :
గడపగడపకూ గోపి.. సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఇంటింటికీ గోపి.. అభివృద్ధిపై హామీ
నీటి కష్టాలకు చెక్.. రూ.4.71 కోట్ల నిధులు
తాగునీటి సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం
పట్టణంలోని 4వ సెగ్మెంట్ కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి పసుపులేటి గోపి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గడపగడపకూ వెళ్లి ప్రజలను పలకరిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా మోడల్ కాలనీ, ఇందిరా కాలనీ, వసంత కాలనీ, హనుమాన్‌పేట ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కృషితో పట్టణంలో తాగునీటి వసతుల అభివృద్ధికి రూ.4.71 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే నీటి ట్యాంకుల నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు నన్నపనేని నరసింహారావు, పట్టణ అధ్యక్షుడు వేమా కిషోర్, బాణావతు సైదులు, ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

